సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష 2 వ రోజు

సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట జరుగుతున్న నిరసన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బాధితులందరూ ఏకమై శాంతియుతంగా కూర్చొని తమ గోడును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన తెలుపుతున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.రెండో రోజు దీక్షలో అంజయ్య, అనిల్, అంబటి రాజశేఖర్, ఉస్మాన్, షేక్ బాబర్, ఓం ప్రకాష్, తిరుమల శ్రీనివాస్, రంజిత్, హాకుల రవి, సమ్మయ్య, కొలిపాక అన్వేష్, ముద్దుకూరి రవికుమార్, దొడ్ల కుమార్, రామిళ్ల సందీప్, లక్క శ్రావణ్ గౌడ్, దన్నడ రాజు, డిష్ బాబు, దీపిక, కొమురమ్మ తదితరులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. బాధిత కుటుంబాలంతా ఐక్యంగా నిలబడి రెండో రోజు నిరసన దీక్షను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

  • Related Posts

    _మేము జనసేనతో కూడా పొత్తు పెట్టుకోము..

    తెలంగాణలో వచ్చే ఏ ఎన్నికల్లోనూ జనసేనతో కానీ వేరే పార్టీలతో కానీ పొత్తు ఉండదు – టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు

    తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

    Aug 08, 2026, తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీతెలంగాణ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్, భువనగిరి, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో వానలు పడుతున్నాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష 2 వ రోజు

    సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష 2 వ రోజు

    _మేము జనసేనతో కూడా పొత్తు పెట్టుకోము..

    _మేము జనసేనతో కూడా పొత్తు పెట్టుకోము..

    తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

    తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

    ప్రైవేటు స్కూళ్లు లెక్కలివ్వవు.. విద్యాశాఖ షోకాజ్ నోటీసులు

    ప్రైవేటు స్కూళ్లు లెక్కలివ్వవు.. విద్యాశాఖ షోకాజ్ నోటీసులు